ఎర్రగొండపాలెంలో 'రైతన్న మీ కోసం'
ప్రకాశం: ఎర్రగొండపాలెం(M) ఆమానిగుడిపాడు గ్రామంలో సోమవారం 'రైతన్న మీ కోసం' కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు కోసం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తులో ఏం చేయబోతుందనే విషయాలను TDP మండల అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి రైతులకు వివరించారు. రైతన్నలకు అండగా కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దివ్య కోటేశ్వరరావు, వ్యవసాయ అధికారి నీరజ తదితరులు పాల్గొన్నారు.