సోయా కొనుగోళ్లపై ఆందోళన చెందవద్దు: కలెక్టర్
NRML: రైతులు సోయా కొనుగోళ్లపై ఆందోళన చెందవద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోయా రైతులు నిర్దేశించిన తేమశాతం ప్రకారం తమ పంటను అమ్మడానికి తీసుకురావాలని అన్నారు. మండల స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు సోయా రైతులకు టోకెన్లు జారీ చేస్తున్నారని, నిర్దేశించిన సమయం ప్రకారం రైతులు రావాలన్నారు.