రోడ్డు ప్రమాదంలో పాడి గేదెలు మృతి

రోడ్డు ప్రమాదంలో పాడి గేదెలు మృతి

BDK: ఇవాళ తెల్లవారుజామున కొత్తగూడెం-సత్తుపల్లి జాతీయ రహదారిపై తిప్పనపల్లి గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదంలో 3 పాడి గేదెలు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బొగ్గు లోడుతో వెళ్తున్న టిప్పర్ గేదెలను ఢీకొట్టడంతో, ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. మరో గేదెకు తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం భారీ మంచు కురుస్తుండటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.