'నియోజకవర్గాన్ని విశాఖలో విలీనం చేయాలి'

'నియోజకవర్గాన్ని విశాఖలో విలీనం చేయాలి'

VZM: ఎస్‌కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీన ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రముఖ విద్యావేత్త డాక్టర్ చిప్పాడ శేషగిరిరావు శనివారం ఓ ప్రకటనలో కోరారు. కొంతమంది ఎస్‌కోటను విజయనగరం జిల్లాలో ఉంచాలని సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఎన్నికల హామీ మేరకు నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో కలపాలని కోరారు.