బైక్ ఢీకొట్టడంతో ఒకరి మృతి
TPT: డక్కిలి మండలం లింగసముద్రం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నడిచి వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. ఈక్రమంలో అతను చనిపోయాడు. మృతుడు గొణుగొడుగు వెంకటరమణయ్య గా గుర్తించారు. బైక్ మీద ఉన్న వ్యక్తి సైతం తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంకటగిరి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.