సబ్ జైల్‌లో ఆకస్మిక తనిఖీ

సబ్ జైల్‌లో  ఆకస్మిక తనిఖీ

PPM: అదనపు జడ్జి, ఫస్ట్ క్లాస్ క్లాస్ మేజిస్ట్రేట్ జె. సౌమ్య జోసెఫిన్ శనివారం సబ్ జైల్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. జైలులో వసతులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి పరిస్థితులు పట్ల ఆరా తీశారు. నాణ్యమైన ఆహారం అందుతుందా లేదా అని ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆదేశించారు. చక్కటి నడవడిక, నైతిక విలువలు వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది అన్నారు.