చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీఓ

కోనసీమ: ప్రతి గ్రామ పంచాయతీలోనూ తడి పొడి చెత్త సేకరణ చేపట్టాలని అలాగే చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలని కొత్తపేట ఆర్డీఓ కె. శ్రీకర్ ఆదేశించారు. రావులపాలెంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. తడి పొడి చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించారు. వర్మీ కంపోస్ట్ మరింత ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.