జూబ్లీహిల్స్‌లో జోరందుకున్న ప్రచారం
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికలకు కొన్ని రోజులే మిగిలి ఉండడంతో ప్రచారాన్ని అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలన్న కృతనిశ్చయంతో మూడు పార్టీలు ఉండగా.. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ల ఓటర్లకు అభ్యర్థులు గాలం వేస్తున్నట్లు సమాచారం.