మురికి కాలువ నీటి సమస్యతో ఆందోళన
నిర్మల్ డాక్టర్స్ లైన్ కాలనీ సమీపంలో కల్వర్టు మురికితో నిండిపోవడం వలన నీరు సరిగా ప్రవహించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ బాటిల్స్, వ్యర్థాలు కల్వర్టును అడ్డుకోవడం వల్ల నీరు నిలిచి దుర్గంధం విస్తరిస్తోందన్నారు. గ్రామవాసులు, పట్టణవాసులు మున్సిపల్ అధికారులను వెంటనే చర్యలు తీసుకుని కాలువలను శుభ్రం చేసి, నిలిచిన నీటితో వచ్చే వ్యాధులను నివారించాలని కోరుతున్నారు.