గణేశ్ ఉత్సవాలపై ఈనెల 23న సమావేశం: DSP

KDP: గణేష్ ఉత్సవాలు పురస్కరించుకొని ఈనెల 23న శనివారం ఉదయం 11 గంటలకు స్థానిక మూడో టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉత్సవ నిర్వాహకులు కమిటీ సభ్యులకు సమావేశం ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ భావన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటు కోసం పోలీస్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని డీఎస్పీ సూచించారు. వెబ్ సైట్లో ఉచితంగా అనుమతులు పొందవచ్చన్నారు.