ఘనంగా సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు
ప్రకాశం: సత్యసాయిబాబా చేసిన సేవలు మరువలేనివని మున్సపల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. ఆదివారం కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో ఉన్నతాధికారుల వారి ఆదేశముల మేరకు సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ గఫార్ మాట్లాడుతూ.. బాబా భౌతికంగా కనిపించకపోయినా ఆయన స్థాపించిన సేవా సంస్థలు ఇప్పటికీ ప్రజలను ఆదుకుంటున్నాయని గుర్తు చేశారు.