VIDEO: ఉదయగిరిలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి
NLR: ఉదయగిరి పట్టణంలోని ABM కాంపౌండ్ ఆవరణలో సుమారు 60 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఇంద్రసేనారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమికంగా, ఆ వ్యక్తి గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.