VIDEO: వైకుంఠాపురంకు పోటెత్తిన భక్తులు
SRD: సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠాపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు శనివారం పోటెత్తారు. శ్రీదేవి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించేందుకు పట్టణ ప్రజలే కాకుండా, జంట నగరాల నుంచి భక్తులు అశేష సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్ కట్టారు. స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో నిండి జనసంద్రమైంది.