భీమేశ్వరాలయంలో 100వ వారం.. హనుమాన్ చాలీసా పారాయణం

SRCL: వేములవాడ అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 100వ వారం హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు శ్రీధర్ పాల్గొన్నారు. హనుమాన్ చాలీసా పారాయణం ఆరోగ్యానికి, శాంతికి మేలని, ప్రతి హిందువు ఇంట్లో ప్రతిరోజూ పారాయణం చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా 108 పర్యాయాలు పారాయణం జరిగిందన్నారు.