బాల్య వివాహాలతో ఆరోగ్య సమస్యలు: ICDSCDPO
CTR: బాల్య వివాహాలను నివారించగలిగితే.. చిన్న వయసులో గర్భం దాల్చకుండా అరికట్టవచ్చని ICDS-CDPO రాజేశ్వరి అన్నారు. పుంగనూరులోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కౌమార గర్భిణులు, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు హాజరయ్యారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలు అవగాహన కల్పించాలన్నారు.