'ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు'
KMR: కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించినట్లు వ్యవసాయ విస్తీర్ణాధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సకాలంలో ఆరబెట్టిన వరి ధాన్నాన్ని రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఖరీఫ్‌లో రైతులు పంట తీవ్రంగా నష్టపోయినప్పటికీ కాపాడిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారని పేర్కొన్నారు.