గ్లోబల్ అతిథులకు సకినాలు, బదామ్ కీ జాలీ
TG: గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చే అతిథుల కోసం ప్రభుత్వం అదిరిపోయే ఏర్పాట్లు చేస్తోంది. వారి కోసం స్పెషల్‌గా 'కల్చరల్ ఫుడ్ బాస్కెట్' రెడీ చేయిస్తోంది. ఇందులో మన తెలంగాణ స్పెషల్స్ సకినాలు, తీపి అప్పాలు, నోట్లో కరిగిపోయే బదామ్ కీ జాలీ, మహువా లడ్డూలు ఉండబోతున్నాయి. విదేశీ గెస్టులు మన రుచులు చూసి ఫిదా అవ్వాల్సిందేనని.. క్వాలిటీ విషయంలో ప్రభుత్వం అస్సలు తగ్గట్లేదు.