సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ఆహ్వానం అందింది. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటికి ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం వారు శత జయంతి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు, భాగస్వామ్యంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డి కూడా ఉన్నారు.