VIDEO: బాల్క సుమన్ విడుదల.. ఓయూలో BRSV నేతల సంబరాలు
HYD: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ జైలు నుంచి విడుదల కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ BRSV నేతలు ఉస్మానియా యూనివర్సిటీ కళాశాల వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా BRSV నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివ, నాగేందర్ రావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.