సమస్యలు పరిష్కారించాలని ఎమ్మెల్యేకి వినతి

సమస్యలు పరిష్కారించాలని ఎమ్మెల్యేకి వినతి

GNTR: పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ 104 మొబైల్ మెడికల్ యూనిట్ సిబ్బంది సోమవారం తూర్పు ఎమ్మెల్యే నసీర్‌కు వినతిపత్రం అందజేశారు. గత యాజమాన్యం అరబిందో నుంచి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం ఇప్పించాలని, ప్రతి ఉద్యోగికి రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లక్ష్మణరావు, నాగులు, సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.