నూతన్‌కల్‌లో నీటి వనరుల గణన పరిశీలన
SRPT: నూతన్‌కల్ మండలంలో జరుగుతున్న 7వ చిన్న నీటిపారుదల, 2వ నీటి వనరుల గణన పనులను శుక్రవారం రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆర్థిక, గణాంక శాఖ ఉప సంచాలకులు నందిని, సీపీలో కిషన్ బృందం సాగునీటి వనరులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. బోర్లు, బావులు, చెరువుల వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు.