దుద్దిళ్ల శ్రీపాదరావుకు నివాళులు అర్పించిన కలెక్టర్
ASF: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు మాజీ స్పీకర్, స్వర్గీయ నేత దుద్దిళ్ల శ్రీపాదరావు వన్నె తెచ్చారని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. సోమవారం ఆయన జయంతి సందర్భంగా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీపాదరావు న్యాయవాదిగా ప్రజలకు మంచి సేవలు అందించారని పేర్కొన్నారు.