నేటి నుంచి బడిబాట కార్యక్రమం

KMR: నేటి నుంచి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. ఈనెల 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామాల్లో బడిబాట పిల్లలను ఉపాధ్యాయులు గుర్తించి బడిలో 100% చేర్పించాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అనుభవం గల ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యాబోధన చేస్తారు.