నకిలీ పాసుపుస్తకం ఇచ్చారని కేసు నమోదు

అన్నమయ్య: నకిలీ పాస్ పుస్తకం ఇచ్చారని సుండుపల్లి మండలం ఉరవపల్లెకు చెందిన నాగేంద్ర భార్య నందిని ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన పి. నాగన్నపై కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. 2021లో నాగన్న తమ వద్ద రూ. 50 వేలు తీసుకుని పాసు పుస్తకం ఇచ్చారని.. ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోగా నకిలీదని తేలడంతో నందిని పోలీసులను ఆశ్రయించారు.