'మంత్రి వివేక్‌ని కలిసిన కాంగ్రెస్ నాయకులు'

'మంత్రి వివేక్‌ని కలిసిన కాంగ్రెస్ నాయకులు'

ADB: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని తలమడుగు మాజీ జడ్పీటీసీ గణేశ్‌రెడ్డి బుధవారం మందమర్రిలో కలిశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి తదితర అంశాలపై మంత్రితో చర్చించారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. నాయకులు వెంకటకృష్ణారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సంజీవ్, తదితరులు ఉన్నారు.