JNTUలో ఘనంగా ఇంజనీరింగ్ డే వేడుకలు

ATP: JNTUలో ఇంజినీర్స్ డే వేడుకలను సోమవారం ఉపకులపతి ప్రొఫెసర్ సుదర్శన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. రిజిస్టార్ కృష్ణయ్య, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.