పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సన్మానం

పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సన్మానం

MNCL: బెల్లంపల్లి ఏరియా ఖైరీగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో సుదీర్ఘకాలం పాటు సేవలందించి శనివారం పదవీ విరమణ పొందిన సీనియర్ హెడ్ ఓవర్ మెన్ బండి రవీందర్, సీనియర్ మైనింగ్ సర్దార్ సత్యనారాయణని AITUC నాయకులు సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేశారని, సంస్థ అభివృద్దిలో వారి పాత్ర కీలకమని కొనియాడారు. వారి శేష జీవితం ఆనందంగా గడపాలన్నారు.