తిరుమలలో కాళీయమర్ధనుడికి అభిషేకం

తిరుమలలో కాళీయమర్ధనుడికి అభిషేకం

TPT: గోకులాష్టమి సందర్భంగా తిరుమల గోగర్భం సమీపంలోని కాళీయమర్ధనుడైన శ్రీకృష్ణుడికి టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో శనివారం అభిషేకం నిర్వహించారు. ఈ మేరకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ, ఉట్లోత్సవం నిర్వహించారు. కాగా, ఈ కార్యక్రమంలో ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు పాల్గోన్నారు.