పొట్టి శ్రీరాములు ఆశయాలు మార్గదర్శకం: కలెక్టర్
సత్యసాయి: త్యాగమూర్తి శ్రీ పొట్టి శ్రీరాములు ఆశయాలు, ఆదర్శాలు తరతరాలకు మార్గదర్శకమని కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో నిర్వహించిన పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో ఆయన, జేసీ మౌర్య భరద్వాజ్‌తో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ..పొట్టి శ్రీరాములు చూపిన దీక్ష, త్యాగం చిరస్మరణీయమన్నారు.