'చంద్రబాబుది కట్టుడు, జగన్‌ది కూల్చుడు రాజకీయం'

'చంద్రబాబుది కట్టుడు, జగన్‌ది కూల్చుడు రాజకీయం'

GNTR: రాష్ట్రాభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ శనివారం మంగళగిరిలో అన్నారు. వైసీపీ పాలనలో భూకబ్జాలు, అరాచకాలతో రావణకాష్టంగా మారిందని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ ఉత్తరాంధ్రను ఐటీ, ఏఐ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. చంద్రబాబుది కట్టుడు సిద్ధాంతం, జగన్‌ది కూల్చుడు వ్యవహారం' అని వ్యాఖ్యానించారు.