విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కావొద్దు: సీపీ

కరీంనగర్: విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని రూరల్ ఏసీపి వెంకటరమణ తెలిపారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి ఆదేశాల మేరకు ఎల్ఎండి పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.