ముగిసిన రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ముగిసిన రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

NLG: మర్రిగూడ మండలం యరగండ్లపల్లిలో ఐదు రోజులుగా అత్యంత వేడుకగా సాగుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం రథోత్సవంతో ఘనంగా ముగిశాయి. సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్థుల సహకారంతో ఉత్సవాలు కనులపండువగా సాగాయని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.