NCVBDC రాష్ట్ర ఉప సంచాలకులు పర్యటన

విజయనగరం: NCVBDC రాష్ట్ర ఉప సంచాలకులు ఎ.టి. రామనాధరావు గురువారం సాలూరు మండలం తోణాం PHCని సందర్శించారు. ఆసుపత్రి పలు రికార్డులు తనిఖీ చేశారు. మలేరియా, డెంగ్యూ మొదలగు జ్వరాలు నమోదు వివరాలు, నిర్ధారణ పరీక్షలు, క్షేత్ర స్థాయిలో ఫీవర్ సర్వలెన్స్, స్ప్రేయింగ్ తదితర నివారణ చర్యల వివరాలపై సిబ్బందిని ఆరా తీశారు. డీఎంఓటి. జగన్ మోహన్ పాల్గొన్నారు.