అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

NRML: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో బుధవారం రాత్రి ఫోన్‌లో సమీక్ష నిర్వహించారు. వర్షాల తీవ్రత, వరద పరిస్థితులపై ఆరా తీసి, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.