దసరా సందర్భంగా చీరల పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్
మహబూబ్ నగర్ పురపాలక పాలకొండ వార్డు మాజీ కౌన్సిలర్ మోస నరేందర్ దసరా పండుగ సందర్భంగా గ్రామాలకు చెందిన మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌన్సిలర్ నరేందర్ చక్కటి కార్యక్రమాన్ని చేశారని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.