బాధితుల వద్దకే వెళ్లి అర్జీలు స్వీకరించిన ఎస్పీ
అన్నమయ్య: ప్రజల సమస్యల పరిష్కరించడంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశించారు. సోమవారం మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఆయన బాధితుల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. వృద్ధుల వద్దకే స్వయంగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.