'వేసవి కాలంలో జాగ్రత్తలు పాటించాలి'

KMR: నిజాంసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం PHC పరిధిలోనీ వచ్చే రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డా.రోహిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీర్ఘ కాలిక వ్యాధులైన మధుమేహం, BP, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు వంటి రోగాలకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు