మద్యం దుకాణం వద్ద వ్యక్తి మృతి

KRNL: కోడుమూరు పట్టణానికి చెందిన ఆంజనేయులు (37) అనే వ్యక్తి ఆదివారం ఓ మద్యం దుకాణం వద్ద మృతి చెందాడు. అతను వెంకటగిరి రోడ్డులోని అనధికారిక పర్మిట్ రూమ్లో మద్యం తాగిన తర్వాత అక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న సమీప బంధువులు మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. మృతుడికి (37) భార్యాపిల్లలు లేరు. తాపీ పనిచేస్తూ బతికేవాడని తెలిపారు.