భారీ వర్షాలు.. కలెక్టర్లకు మంత్రి సూచనలు

ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, ములుగు జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయం నుంచి సోమవారం జిల్లా కలెక్టర్లకు వీడియో కాల్ ద్వారా మంత్రి సీతక్క పలు సూచనలు చేశారు. ముంపు ప్రాంతాలు, వాగుల వద్ద అధికారులను అప్రమత్తం చేయాలని, అవసరమైతే మండలాల వారీగా కమిటీలు వేయాలని సూచించారు.