VIDEO: విద్యార్థులతో కలెక్టర్ ముచ్చట్లు.. వారితోనే కలిసి భోజనం!
E.G: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, బోధన పద్ధతులు, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం సీతానగరం మండలం పురుషోత్తన పట్నం గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.