ప్లాస్టిక్ వాడకం నిషేధించాలి: మున్సిపల్ కమిషనర్

KMR: ఎల్లారెడ్డి పట్టణంలో ప్లాస్టిక్ వాడకం నిషేధించాలని కోరుతూ మున్సిపల్ అధికారులు శుక్రవారం మార్కెట్ ప్రాంతంలో టీ స్టాల్స్ ఎదుట అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ కప్పులు వాడకుండా గాజు గ్లాసులు వాడుతున్న టీ స్టాల్ యజమానిని సన్మానించారు. కూరగాయల మార్కెట్‌కు జ్యూట్ బ్యాగులతో వచ్చిన వినియోగదారులకు పుష్పాలు అందజేసి ప్రోత్సహించారు.