డెత్ సర్టిఫికెట్ల కోసం గిరిజనుల ఆందోళన

డెత్ సర్టిఫికెట్ల కోసం గిరిజనుల ఆందోళన

ASR: అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ బూరిగ, చిన్న కొనలకొండ శిఖర గ్రామాల గిరిజనులు డెత్ సర్టిఫికెట్ల కోసం నిరసన తెలిపారు. సంవత్సరం నుంచి 18 మంది దరఖాస్తులు చేసుకున్నప్పటికీ సర్టిఫికెట్లు అందడం లేదని వాపోయారు. అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించకపోతే మండల రెవెన్యూ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు.