బాటిళ్లకు నాణ్యత కోసం పిటిషనా?: సుప్రీం ఆగ్రహం

బాటిళ్లకు నాణ్యత కోసం పిటిషనా?: సుప్రీం ఆగ్రహం

మంచినీళ్ల బాటిళ్లకు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ తాగు నీరు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ముందు వారి గురించి ఆలోచించి.. తర్వాత నీళ్ల బాటిళ్ల నాణ్యత గురించి చూద్దామని తెలిపింది. ఈ పిటిషన్ అర్బన్-రిచ్ మనస్తత్వంతో కూడినదిగా పేర్కొంటూ కొట్టివేసింది.