మామిడికుదురు కూడలిలో రంగా జయంతి ఉత్సవాలు

మామిడికుదురు కూడలిలో రంగా జయంతి ఉత్సవాలు

కోనసీమ: మామిడికుదురు శివాలయం సమీపంలో స్థానిక యువత వంగవీటి మోహన రంగా జయంతి సందర్బంగా రంగా జయంతి ఉత్సవాలను జరిపారు. సభా ప్రాంగణం ఏర్పాటు చేసి కేక్ కట్‌‌చేసి పంచారు. అన్ని కులాలను మతాలను సమానంగా చూసిన ఘనత ఆయనకే చెందిందని పలువురు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటి మహీంద్రా, రుద్ర శ్రీను, కోలా సురేష్ తదితరులు పాల్గొన్నారు.