కలికిరి యల్లమ్మ తల్లికి 3 రోజుల పుష్కర కుంభాభిషేక ఉత్సవాలు

కలికిరి యల్లమ్మ తల్లికి 3 రోజుల పుష్కర కుంభాభిషేక ఉత్సవాలు

అన్నమయ్య: కలికిరి గ్రామదేవత యల్లమ్మ తల్లి ఆలయంలో మంగళవారం నుంచి గురువారం వరకు 3 రోజుల పాటు పుష్కర కుంభాభిషేక ఉత్సవాలు జరుగనున్నాయి. ఆలయ ధర్మకర్త అశోక్ కుమార్ రెడ్డి తెలిపారు. అమ్మ వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, నైవేద్యాలతో వైభవంగా జరుపనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.