ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు
NLR: కొండాపురం మండలంలోని మర్రిగుంటలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటు చేసి 48 రోజులు అయిన సందర్భంగా గ్రామంలో ప్రజలందరూ కలిసి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి నైవేద్యాలు సమర్పించి తీర్థప్రసాదాలు పంచిపెట్టారు.ఈ వేడుకలో ముఖ్య అతిథిగా సర్పంచ్ దార్ల గోపి పాల్గొన్నారు.