పేరేచర్ల హత్య కేసులో నిందితులు అరెస్ట్

పేరేచర్ల హత్య కేసులో నిందితులు అరెస్ట్

GNTR: మేడికొండూరు మండలం పేరేచర్లలో ఏప్రిల్ 27న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడు మంగళగిరికి చెందిన ఇట్ట బాలకృష్ణ (40)గా గుర్తించారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బాలకృష్ణను మద్యం సీసాలు, రాయితో కొట్టి చంపినట్లు సీఐ నాగుల మేరా సాహెబ్ తెలిపారు. ఈ కేసులో మంగళగిరికి చెందిన మొగిలి మాధవ, ఫిరంగిపురంకి చెందిన మేడ అశోక్, పాలపర్తి సాంబయ్యను అరెస్ట్ చేశారు.