వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: ఎస్ఐ
GDWL: ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని రాజోలి ఎస్ఐ గోకారి సూచించారు. ఇవాళ రాజోలి పోలీస్ స్టేషన్‌లో సిబ్బందితో జరిగిన సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం చాలా ముఖ్యమని తెలిపారు. ముందుగా పోలీసులే హెల్మెట్లు ధరించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సిబ్బందికి సూచించారు.