'ఎయిర్‌పోర్టులోని హెల్ప్‌డెస్క్ సేవలు వాడుకోవాలి'
JGL: హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ సేవలను గల్ఫ్ కార్మికులు వినియోగించుకోవాలని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ యూఏఈ అధ్యక్షుడు బత్తిని రాజాగౌడ్ కోరారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే కార్మికులకు ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. ఆదివారం గల్ఫ్ కార్మికులతో కలిసి హెల్ప్ డెస్క్‌ను సందర్శించారు.