ఆగస్టు 28 నుండి శ్రీ రంగడి నూలు పూజ పవిత్రోత్సవాలు

ఆగస్టు 28 నుండి శ్రీ రంగడి నూలు పూజ పవిత్రోత్సవాలు

KDP: మధ్యరంగము గా పిలవబడే శ్రీ రంగనాథ స్వామి నూలు పూజ పవిత్రోత్సవాలు ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 5 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ సుధీకర్ రెడ్డి తెలిపారు. ఆయా రోజులలో స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్కొక్క వాహనంపై ఆశీనులై భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. నూలు పూజ మహోత్సవాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు.